
అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులు జోనల్ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక
అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల విద్యార్థులు ఎస్జీఎఫ్ జోనల్ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, క్రీడల ద్వారా విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని, క్రీడల్లో రాణించేలా సంస్థ ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు.
ఇటీవల కరీంనగర్ జిల్లా శివారులోని మల్కాపుర్లో జరిగిన ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రికెట్ పోటీలలో అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్కు చెందిన అనిక్ అశ్వత్ (9వ తరగతి) మరియు ఆర్. ఈశ్వ అనుకరన్ (6వ తరగతి) అండర్-17, అండర్-14 విభాగాలలో ప్రతిభ కనబరచి జోనల్ స్థాయికి అర్హత సాధించినట్లు పేర్కొన్నారు.
జోనల్ స్థాయిలో కూడా మెరుగైన ప్రదర్శన చేసి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కావాలని డాక్టర్ నరేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులను అభినందిస్తూ వారికి పుష్పగుచ్ఛాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
