
సింగరేణి భవన్ ముట్టడిలో కవితను అరెస్టు చేయడాన్ని ఖండించిన జాగృతి జిల్లా అధ్యక్షుడు
సింగరేణి భవన్ ముట్టడిలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ఎన్నికల ముందు సింగరేణి కార్మికుల సంక్షేమానికి అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందని విమర్శించారు.
సింగరేణి మెడికల్ బోర్డు నిర్వహణ, అలియాస్ కార్మికులకు అవకాశాలు, సొంతంటి పథకం అమలు, ఐటీ నిహాయింపుల వంటి కీలక సమస్యలపై కవిత కార్మికుల పక్షాన నిలబడి భవన్‌ను ముట్టడించగా, ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను నిర్లక్ష్యపరిచి అక్రమంగా అరెస్టులు చేసిందని హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా కేంద్రాలతో పాటు సింగరేణి ఏరియాల్లో జాగృతి, HMS కార్మిక సంఘాల నాయకులను నిన్న రాత్రి నుంచే వందల సంఖ్యలో పోలీసులు అరెస్టు చేయడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. నాయకులను అరెస్టు చేస్తే పోరాటం ఆగిపోతుందని ప్రభుత్వం భావిస్తే అది మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు.
కవిత అరెస్టులకు భయపడే నాయకురాలు కాదని, సింగరేణి కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కవిత ఆధ్వర్యంలో కొనసాగుతుందని గుంజపడుగు హరిప్రసాద్ స్పష్టం చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
