
70 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వరంగల్ మత్స్యకార శాఖ అధికారిణి
వరంగల్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో 84 మంది కొత్త సభ్యులను చేర్చుకునే దస్తావేజు ప్రాసెస్ చేసి, ఆమోదం కోసం ఉత్తర్వులు జారీ చేయడానికి ఫిర్యాదుదారుని నుండి రూ.70,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు.
ఈ ఘటనలో మత్స్యకార శాఖ అధికారిణి అల్లు నాగమణి మరియు వారి కార్యాలయంలో పనిచేస్తున్న క్షేత్ర స్థాయి అధికారి (పొరుగు సేవలు) పెద్దబోయిన హరీష్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని ఏసీబీ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఇద్దరిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
