
రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పరిగి అటవీ అధికారులు
పరిగి అటవీ కార్యాలయంలో లంచం కేసు: ముగ్గురు అధికారులపై ఏసీబీ ఉచ్చు
వికారాబాద్ జిల్లా పరిగి అటవీ రేంజ్ కార్యాలయంలో భారీ లంచం కేసు వెలుగుచూసింది. పరిగి రేంజ్ అటవీ ప్రాంతం నుండి బాటసింగారంలోని పండ్ల మార్కెట్కు సీతాఫలాలను రవాణా చేయడానికి అవసరమైన ఆన్లైన్ ట్రాన్సిట్ పర్మిట్లను జారీ చేయడానికి ఫిర్యాదుదారుని నుండి రూ.40,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు.
ఈ ఘటనలో అటవీ రేంజ్ అధికారి బొల్లుమల్ల సాయికుమార్, అటవీ సెక్షన్ అధికారి మొహమ్మద్ మొయినుద్దీన్, మరియు డ్రైవర్ (పొరుగు సేవలు) బాలనగరం బాలకృష్ణ లు అరెస్టు అయ్యారని అధికారులు తెలిపారు.
ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
