
బాణసంచా లైసెన్స్ కోసం లంచం.. ఎసీబీ వలలో ఫైర్ ఆఫీసర్
నల్లగొండ:బాణసంచా దుకాణం నడపడానికి అవసరమైన తాత్కాలిక లైసెన్స్ దరఖాస్తు ప్రాసెస్ చేయడానికి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) ఇవ్వాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన ఫైర్ స్టేషన్ అధికారి ఏ. సత్యనారాయణ రెడ్డి ఎసీబీ (ACB) వలలో చిక్కాడు.
ఫిర్యాదుదారుడు నుండి రూ.8,000/- లంచం తీసుకుంటుండగా ఎసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన నల్లగొండ ఫైర్ స్టేషన్లో చోటు చేసుకుంది.
అధికారిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎసీబీ అధికారులు తెలిపారు.
