
ఏన్కూర్ లిటిల్ ఫ్లవర్ చిన్నారుల వినూత్న విజ్ఞాన యాత్ర
పరిసరాల సంస్థలపై ప్రత్యక్ష అవగాహన కల్పించడం లక్ష్యం
ఏన్కూర్, అక్టోబర్ 15 (zindagi9news వైరా నియోజకవర్గ రిపోర్టర్ : రామునాయక్): ఏన్కూర్ మండలంలోని లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులకు చదువును తరగతి గదులకే పరిమితం చేయకుండా, పరిసరాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించే వినూత్న కార్యక్రమంగా ప్రీ-ప్రైమరీ చిన్నారుల విజ్ఞాన యాత్రను బుధవారం నిర్వహించింది.
ఈ యాత్రలో భాగంగా చిన్నారులు పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్, వైద్యశాల, బ్యాంక్ వంటి ముఖ్య సంస్థలను సందర్శించారు. అక్కడ అధికారులు, సిబ్బంది తమ పనితీరు, బాధ్యతలు, సామాజిక సేవల గురించి పిల్లలకు వివరించారు. పోలీసులు, డాక్టర్లు, తపాలా సిబ్బంది, బ్యాంకు ఉద్యోగుల పనితీరును ఆసక్తిగా గమనించిన చిన్నారులు యూనిఫాంలు, వాహనాలు, పరికరాలు, తపాలా పెట్టెలను ఉత్సాహంగా పరిశీలించారు.
సాంప్రదాయ బోధన పద్ధతులకు భిన్నంగా ఈ యాత్ర ద్వారా పిల్లల్లో సామాజిక అవగాహన, పరిశీలనా శక్తి, నేర్చుకునే తపన పెరుగుతుందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ డాక్టర్ పి. భూమేశ్వరరావు, కరస్పాండెంట్ వి. వెంకట సాయి, ప్రీ-ప్రైమరీ ఇన్చార్జ్ స్వాతి, ఉపాధ్యాయులు మరియు యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
