
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ప్రకటించింది. ఎస్ఈసీ ప్రకారం, అక్టోబర్ 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది.
మొదట రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించబడతాయి. మొదటి విడతలో అక్టోబర్ 23న, రెండో విడతలో అక్టోబర్ 27న పోలింగ్ జరగనుంది. ఈ రెండు విడతల ఫలితాలు నవంబర్ 11న ప్రకటిస్తారు.
తదుపరి మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించబడతాయి. ఫేజ్-1లో అక్టోబర్ 31న, ఫేజ్-2లో నవంబర్ 4న, ఫేజ్-3లో నవంబర్ 8న పోలింగ్ జరుగుతుంది. ప్రతి విడతలోనే పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు.
మొత్తం 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహించబడతాయి. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
