
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొంతం దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు
పెబ్బేరు మున్సిపాలిటీ పరిధికి చెందిన కేడిఆర్ గ్రూప్స్ అధినేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొంతం దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెబ్బేరు యువకులు గౌని రంగారెడ్డి, నారెడ్డి దిలీప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ మేడముని రాములు, కారెడ్డి నాగేశ్వర్ రెడ్డి, ఎద్దుల రంజిత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
వీరు దయాకర్ రెడ్డి కు శాలువా కప్పి సన్మానించి, కేక్ కటింగ్ చేయించి, ఆయురారోగ్యాలతో సుదీర్ఘ ఆయుష్షు కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమం హర్షాతిరేకాల మధ్య సాగింది.
