
కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
పెబ్బేరు: స్థానిక ప్రభుత్వ కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ కళాశాలలో బుధవారం వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పర్యావరణహిత మట్టి వినాయకుని ప్రతిష్టించి పూజలు చేశారు.
కళాశాల స్టాఫ్‌తో పాటు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
