
లంచం తీసుకుంటూ మద్దూరులో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఇంజనీర్ పట్టుబాటు
సిద్ధిపేట జిల్లా మద్దూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎంజీఎన్ఆర్ఈజీఎస్ (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) ఇంజనీరింగ్ సలహాదారుడు బండకింది పరుశురాములు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారుల చేతికి చిక్కాడు.
ఫిర్యాదుదారుని నుండి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనులకు సంబంధించిన దస్తావేజులను ధృవీకరించడం, కొలతల తనిఖీ పూర్తి చేసి బిల్లులను మంజూరు చేయడానికి ఉన్నతాధికారులకు పంపే ప్రక్రియలో సహాయం చేస్తానని చెప్పి రూ.11,500/- లంచం స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగగా, సంబంధిత అధికారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
