ఇరిగేషన్ ఎస్ ఈ ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకుడు రాజేంద్రప్రసాద్ యాదవ్

పెబ్బేరు : బదిలీపై ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎస్ ఈ గా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్‌ను వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి ఎం. రాజేంద్రప్రసాద్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన పిజెపి, బీమ, కల్వకుర్తి ఇరిగేషన్ ప్రాజెక్టులలో నీటి సరఫరా సమస్యలు, పరిష్కార మార్గాలపై ఎస్ ఈ చంద్రశేఖర్‌తో చర్చించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కడ ఏ సమస్యలు ఎదురైనా వెంటనే మీ దృష్టికి తీసుకొస్తామని, కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకు సాగుతామని రాజేంద్రప్రసాద్ యాదవ్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాజు నాయక్, అనంద్ సాగర్, చంద్రశేఖర్, నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
