
సింగరేణి: శుక్రవారం సింగరేణి మండలంలో BRS పార్టీ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్ మంజుల మదన్ లాల్ కుటుంబాలను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.
కారేపల్లి కేంద్రంలో పార్టీ జిల్లా నాయకులు, ఉద్యమకారులు జడల వేంకటేశ్వర్లు గారి కుటుంబాన్ని పరామర్శించి, వారి చిత్రపటానికి నమస్కరించి నివాళులర్పించారు. ఇటీవల గుండెపోటు కారణంగా మృతి చెందిన జడల వేంకటేశ్వర్లు గారి కుటుంబానికి BRS పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చింది.
అలాగే, గార్ల పోలీస్ స్టేషన్ ASIగా విధులు నిర్వర్తించిన SK నూరుద్దీన్ కూడా గుండెపోటు కారణంగా మరణించారు. వారి కుటుంబ సభ్యులను కూడా పార్టీ నాయకులు పరామర్శించి, చిత్రపటానికి నమస్కరించి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికుల సహకారంతో ఘనంగా నిర్వహించబడింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
