
కరీంనగర్ : నేడు విడుదలైన NEET-2025 ఫలితాల్లో అల్ఫోర్స్ NEET అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. ఈ సంస్థకు చెందిన వి. శశాంత్ రెడ్డి 599 మార్కులతో మెరిశారు. బి. వర్షిత్ 556, అదిబా పీరోజ్ 553, జె. మైథిలి 535, యం.డి. అఫ్నాన్ 513, బి. భువనకృతి 508, ఏ. సాత్విక 507, జె. అనూష 500 మార్కులు సాధించారు.
NEET కోచింగ్ లో అల్ఫోర్స్ సంస్థ అందిస్తున్న DOCTORS-30 ప్రత్యేక ప్రోగ్రామ్ ఫలితంగా 500కి పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 8కి పెరగడం విశేషం. తక్కువ సంఖ్యలో విద్యార్థులతోనే అధిక మెడికల్ సీట్లు సాధించడంలో అల్ఫోర్స్ తమ ప్రత్యేకతను చాటుకుంది.
ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ –
“పటిష్టమైన శిక్షణా పద్ధతులు, పర్యవేక్షణ, మరియు విద్యార్థుల దీక్ష వలన ఈ ఘనవిజయం సాధ్యమైంది. సుమారుగా 100 మంది విద్యార్థులు వివిధ మెడికల్ కళాశాలల్లో ప్రవేశించే అవకాశం ఉంది. అల్ఫోర్స్ విద్యార్థులు మాత్రమే కాదు, తల్లిదండ్రుల విశ్వాసం, అధ్యాపక బృందం కృషి ఈ విజయానికి కారణం” అని పేర్కొన్నారు.

ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, మరియు సహకరించిన బోధనా సిబ్బందిని డా. నరేందర్ రెడ్డి అభినందించారు.
