తోమాలపల్లిలో అంగన్వాడి భవన శంకుస్థాపన, మోడల్ గ్రామ పంచాయతీ భవన ప్రారంభం
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేతుల మీదుగా శుభారంభం

పెబ్బేరు, జూన్ 14: పెబ్బేరు మండలం తోమాలపల్లిలో నూతనంగా నిర్మించబోయే అంగన్వాడి భవనానికి భూమిపూజ చేయడం, అలాగే మోడల్ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ప్రజల అవసరాలను సకాలంలో తీరుస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్. వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధే మా లక్ష్యం” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు మార్కెట్ యార్డు అధ్యక్షులు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ సాగర్, తోమాలపల్లి మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంధం రంజిత్ కుమార్, దయాకర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ ఈ. రామన్ గౌడ్, మోతె రాముడు, పెబ్బేరు మండల యూత్ అధ్యక్షులు రాజేష్, శ్రీరంగాపూర్ టౌన్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు, తోమాలపల్లి గ్రామ అధ్యక్షులు బోరింగ్ శ్రీను, మాజీ అధ్యక్షులు రంగన్న యాదవ్, సీనియర్ నాయకులు చంటి (మొగులన్న), రాముడు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
