
జమ్మికుంట, మే 31: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని ఆరోగ్య ఉపకేంద్రాల వైద్య సిబ్బంది శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డాక్టర్ చందు (డిప్యూటీ డీఎంహెచ్ఓ, హుజురాబాద్) పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా వైద్యులు మరియు ఆరోగ్య సిబ్బంది ప్రజలకు ధూమపానం మరియు పొగాకు వినియోగం వల్ల కలిగే అనారోగ్యపరమైన ప్రమాదాలపై అవగాహన కల్పించారు. సిగరెట్ మరియు ఇతర పొగాకు ఉత్పత్తులు కేవలం వ్యక్తిని మాత్రమే కాదు, కుటుంబాన్ని కూడా చిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉందని వారు వివరించారు.
భారత ప్రభుత్వం ఇప్పటికే కొన్ని బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వినియోగాన్ని నిషేధించిందని గుర్తు చేస్తూ, ప్రతి సంవత్సరం మే 31న పొగాకు కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంపొందించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యువత పొగాకు వాడకాన్ని తగ్గించుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు.
ఈ ర్యాలీలో ఎం.ఎల్.హెచ్.పి. డాక్టర్లు – డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ చందన, డాక్టర్ మహోన్నత పటేల్, డాక్టర్ పరహానుద్దీన్, డాక్టర్ హిమబిందు, డాక్టర్ సంధ్య, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్వైజర్లు రత్నకుమారి, అరుణ, కుసుమ కుమారి, సదానందం, మరియు ఆరోగ్య సిబ్బంది నరేందర్, సరళ, వనజ, సావిత్రి, సాజిదా పర్వీన్, రాధా, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
