– శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు మొహమ్మద్ అంజదుల్లా ఖాన్

హుజురాబాద్ పట్టణంలోని ఈదిగా మైదానంలో రంజాన్ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా మత పెద్దలు సోదరభావం, మత సామరస్యంపై సందేశాలు అందించారు. బీఆర్ఎస్ నాయకుడు మొహమ్మద్ అంజదుల్లా ఖాన్ మాట్లాడుతూ, “రంజాన్ పండుగ శాంతి, ప్రేమ, సహనం వంటి విలువలను పెంపొందించేందుకు ఉపకరిస్తుంది. మత సామరస్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని పేర్కొన్నారు.
పలువురు ముస్లిం పెద్దలు, యువత భారీ సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వేడుకలను విజయవంతంగా నిర్వహించిన కమిటీ సభ్యులను అభినందిస్తూ, బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఇమ్రాన్ (బాబా షరఫుద్దీన్), అర్షద్, ఇర్ఫాన్, షఫీ, తాజ్, ఆశు, గఫ్ఫార్ తదితరులు పాల్గొన్నారు.

Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
