తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యే కోటా అభ్యర్థులను ఖరారు చేసింది. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.
అభ్యర్థులు:
🔹 అద్దంకి దయాకర్ – టీపీసీసీ ప్రధాన కార్యదర్శి
🔹 కేతావత్ శంకర్ నాయక్ – నల్గొండ డీసీసీ అధ్యక్షుడు
🔹 విజయశాంతి – పార్టీ సీనియర్ లీడర్
ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ సీటును సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్, మిగిలిన మూడు స్థానాల్లో పార్టీ నమ్మకస్థులకు అవకాశం కల్పించింది. అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు.
ఎన్నికల షెడ్యూల్:
📅 ఈనెల 20న ఎమ్మెల్సీ ఎన్నికలు
📅 అదేరోజు కౌంటింగ్, ఫలితాల వెల్లడి
తెలంగాణ కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యే కోటాలో పోటీచేస్తున్న అభ్యర్థుల గెలుపు లాంఛనమేనని నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి నిబద్ధతగల నేతలకు న్యాయం చేస్తామన్న మాటను నిలబెట్టుకున్నట్లు అధిష్టానం స్పష్టం చేసింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
