జమ్మికుంటలో మొబైల్ దొంగతనం కేసు వెలుగు చూసింది. ఫిర్యాదిదారు మీర్జాన్ ఇమ్రాన్ బేగ్ (46) జమ్మికుంటలోని పారడైజ్ బిర్యాని సెంటర్ లో పనిచేస్తుండగా, తరచుగా షాప్‌కు వచ్చే మహమ్మద్ ఇమ్రాన్ భాష (35) ఇంటికి ఫోన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి, వన్‌ప్లస్ మొబైల్ తీసుకున్నాడు. ఫోన్ మాట్లాడతానని చెప్పి బయటకు వెళ్లిన నిందితుడు, ఆ తర్వాత ఫోన్‌తో పాటు పారిపోయాడు.
అంతేకాకుండా, ఆ మొబైల్ ఫోన్ ద్వారా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఫిర్యాదిదారుడి బ్యాంక్ ఖాతా నుంచి రూ.1.40 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించారు.
ఈ ఘటనపై మీర్జాన్ ఇమ్రాన్ బేగ్ ఫిర్యాదు మేరకు మహమ్మద్ ఇమ్రాన్ భాష పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. దర్యాప్తు కొనసాగుతోంది.
