పదో తరగతి విద్యార్థులకు బండి సంజయ్ భారీ గిఫ్ట్ – 20,000 సైకిళ్లు పంపిణీకి సన్నద్ధం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు ఒక వినూత్న కానుక అందించనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు మరియు రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు 20,000 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
జిల్లాల వారీగా టెన్త్ క్లాస్ విద్యార్థుల వివరాలు:
- కరీంనగర్ జిల్లా – 3,096 మంది
- రాజన్న సిరిసిల్ల – 3,841 మంది
- జగిత్యాల – 1,137 మంది
- సిద్దిపేట – 783 మంది
- హన్మకొండ – 491 మంది
- మొత్తం: 9,348 మంది
పంపిణీ విధానం:
- ప్రతి మండలానికి అదనంగా 100 సైకిళ్లు
- కరీంనగర్ కార్పొరేషన్‌లోని 66 డివిజన్లకు 50 చొప్పున
- హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీలకు వార్డుల వారీగా 50 చొప్పున
- గ్రామ పంచాయతీలకు 10 నుండి 25 సైకిళ్లు చొప్పున
సైకిళ్ల ఖర్చు వివరాలు:
ఒక్కో సైకిల్ ఖరీదు రూ.లు 5,300. మొత్తం 20,000 సైకిళ్ల ఖర్చు సుమారు రూ.లు 10 కోట్లు. ఇప్పటికే 5,000 సైకిళ్లు కరీంనగర్‌కు చేరాయి. తొలి దశ పంపిణీ ఈనెల 8 లేదా 9 తేదీన ప్రారంభమవనుంది.
ఎందుకు టెన్త్ విద్యార్థులకే?
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు సాధారణంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారు. స్కూల్‌కు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా టెన్త్ తరగతి విద్యార్థులు స్పెషల్ క్లాసుల కోసం ఆలస్యంగా స్కూల్ నుండి ఇంటికి చేరాల్సి వస్తుంది. ఈ సమస్యల నివారణకు బండి సంజయ్ రవాణా సౌలభ్యం కల్పించే ఉద్దేశంతో సైకిళ్లను అందిస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బండి సంజయ్ ఫోటోలు కూడా సైకిల్ రాడ్‌పై ముద్రించనున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
