వ్యవసాయం పండుగగా మారే దిశగా ప్రజా ప్రభుత్వం సంకల్పబద్ధం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, జూన్ 24 (జిందగీ9న్యూస్): “వ్యవసాయం దండుగ కాదు… పండుగ” అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులను రాజులుగా చేసే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రైతు భరోసా ద్వారా రైతులకు నేరుగా మద్దతు అందిస్తూ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఉన్నామని పేర్కొన్నారు.
జూన్ 16 నుండి రైతు భరోసా నిధులు జమ చేయడం ప్రారంభించి, 9 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.9,000 కోట్లు జమ చేసినట్టు వెల్లడించారు.
రాజీవ్ గాంధీ విగ్రహం ఎదురుగా జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,600 రైతు వేదికల నుండి లక్షలాది రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు.
- ఎకరాకు రూ.12,000 మద్దతు: మొత్తం 1.40 కోట్ల ఎకరాలకు రూ.12,000 చొప్పున మద్దతు అందించారు.
- ప్రాధాన్యత క్రమం: రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యత ఉన్నదని వెల్లడించారు.
- రుణ మాఫీ: రూ.20,617 కోట్లతో 25.35 లక్షల రైతులకు రుణ విముక్తి కల్పించారు.
- ధాన్య చెల్లింపులు: 48 గంటల్లో చెల్లింపులు, సన్నవడ్లకు బోనస్ కల్పన.
- 1.04 లక్షల కోట్లు వ్యవసాయ రంగానికి: రైతు భరోసా, ఉచిత కరెంట్, సోలార్ పంపులు తదితరానికి ఖర్చు.
- మహిళలకు ప్రత్యేక పథకాలు: ఉచిత బస్సు, అమ్మ పాఠశాలలు, యూనిఫాం కుట్టింపు.
- 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు: ఏడాదిలోనే భర్తీ చేసిన ప్రభుత్వ విధానం.
- రాజీవ్ యువ వికాసం: యువతకు ప్రణాళికతో ముందుకు.
- జలవనరుల పోరాటం: బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు, కేంద్రానికి ఫిర్యాదు.
ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కోదండరెడ్డి తదితరులు హాజరయ్యారు.

