
హైదరాబాద్: మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీస్ ప్రపంచంలో నెం.1 స్థానాన్ని సాధించింది. 138 దేశాలతో పోటీ పడి సాధించిన ఈ ఘనతపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నార్కొటిక్ విభాగానికి చెందిన చీఫ్ సీవీ ఆనంద్ బృందానికి సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు.
డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం కృషిచేసే ప్రతి పోలీస్‌కు తన మద్దతు ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.
