రాష్ట్ర ప్రథమ ర్యాంకర్ రశ్మితకు కలెక్టర్ చిత్ర మిశ్రా సత్కారం

కరీంనగర్, జూన్ 15(Zindagi9news): ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 469 మార్కులు సాధించి రాష్ట్ర ప్రథమ ర్యాంకు పొందిన రామడుగు మోడల్ స్కూల్ విద్యార్థిని కడారి రశ్మితను జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పట్టుదల, క్రమశిక్షణతో మరిన్ని విజయాలు సాధించి జిల్లా ఖ్యాతిని మరింత పెంచాలని విద్యార్థినికి సూచించారు. రశ్మిత సాధించిన అద్భుత విజయానికి కారణమైన ఆమె తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు.
విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని నిరంతర శ్రమతో ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి, కోఆర్డినేటర్, రామడుగు సర్పంచ్, రామడుగు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
