
26 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిసిన స్కూల్ మిత్రులు
కాకతీయ హై స్కూల్ 98–99 బ్యాచ్ పూర్వ విద్యార్థుల స్నేహసమ్మేళనం
జమ్మికుంట:
పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే అరుదైన క్షణాలకు వేదికగా మారింది జమ్మికుంట.
కాకతీయ హై స్కూల్ 1998–99 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 26 సంవత్సరాల తర్వాత మళ్లీ ఒక్క చోట చేరి
చిన్ననాటి స్నేహాన్ని మరింత గాఢం చేసుకున్నారు. ఈ స్నేహ సమ్మేళనం ఆదివారం జమ్మికుంటలోని
వినాయక గార్డెన్స్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా దుమ్కా జిల్లా కలెక్టర్ దొడ్డే ఆంజనేయులు,
ఆర్మీ సోల్జర్ నరేందర్ గౌడ్ హాజరయ్యారు. దేశ రక్షణలో విశేష సేవలు అందిస్తున్న
మిత్రుడు నరేందర్ గౌడ్‌ను స్నేహితులు ఘనంగా సన్మానించారు.
చిన్ననాటి గుర్తులు, పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ, హర్షాతిరేకాలతో మిత్రులు తమ అనుభవాలను
పంచుకున్నారు. ఈ సమావేశం మిత్రత్వానికి, మానవ సంబంధాలకు గొప్ప ఉదాహరణగా నిలిచిందని
పాల్గొన్న వారు భావించారు.
