జమ్మికుంటలో కో-ఆప్షన్ పోస్టులకు 26 దరఖాస్తులు

జమ్మికుంట, ఏప్రిల్ 17(zindagi9news):
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు మొత్తం 26 దరఖాస్తులు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ వెల్లడించారు.శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో నాలుగు కో-ఆప్షన్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరగా మంచి స్పందన లభించిందన్నారు.
వివరాల ప్రకారం, జనరల్ విభాగంలో మొత్తం 13 దరఖాస్తులు వచ్చాయి. అందులో పురుషులు 8 మంది, మహిళలు 5 మంది ఉన్నారు. అలాగే మైనారిటీ విభాగంలో కూడా మొత్తం 13 దరఖాస్తులు వచ్చాయి. అందులో పురుషులు 9 మంది, మహిళలు 4 మంది దరఖాస్తు చేశారు.
మొత్తంగా జనరల్ మరియు మైనారిటీ విభాగాల నుంచి 26 దరఖాస్తులు అందినట్లు కమిషనర్ తెలిపారు. కో-ఆప్షన్ సభ్యుల ఎంపికను నిబంధనల ప్రకారం త్వరలో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
