హుజురాబాద్లో కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు 14 దరఖాస్తులు

హుజురాబాద్, ఏప్రిల్ 17(zindagi9news):
హుజురాబాద్ పురపాలక సంఘంలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియకు మంచి స్పందన లభించింది. మొత్తం నాలుగు (4) కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానించారు.చివరి తేదీ అయిన ఏప్రిల్ 17 వరకు మొత్తం 14 దరఖాస్తులు అందినట్లు పురపాలక సంఘం కమిషనర్ తెలిపారు.
వివరాల ప్రకారం, జనరల్ విభాగంలో 5 మంది (పురుషులు 2, మహిళలు 3), మైనారిటీ విభాగంలో 9 మంది (పురుషులు 6, మహిళలు 3) దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం దరఖాస్తుల్లో పురుషులు 8 మంది, మహిళలు 6 మంది ఉన్నారు.అర్హుల ఎంపికను సంబంధిత నిబంధనల ప్రకారం త్వరలో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
