
23వ వార్డు కౌన్సిలర్ రేసులో కండెం వంశికృష్ణ
జమ్మికుంట పట్టణంలోని 23వ వార్డు నుంచి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు కండెం వంశికృష్ణ ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—
ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే వార్డు రూపురేఖలను మార్చి అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. కుల, మత, పార్టీ భేదాలకు అతీతంగా ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వస్తున్నానని, నాయకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానని స్పష్టం చేశారు.
జర్నలిస్టుగా ప్రజా సమస్యలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని, అదే అనుభవంతో వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా విజయం సాధించి, నిస్వార్థంగా సేవ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
రిజర్వేషన్ అనుకూలిస్తే బరిలో ఉంటానని, డబ్బు ప్రలోభాలకు లొంగకుండా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ప్రజాసేవకే పూర్తి సమయం కేటాయిస్తానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
