21 అంగన్వాడీ కేంద్రాలు.. రూ.63 వేల లంచం.. ACBకి చిక్కిన CDPO

జగిత్యాల జిల్లా, మెట్పల్లి: అంగన్వాడీ కేంద్రాల తనిఖీల్లో అనుకూలంగా రిపోర్ట్ ఇస్తానంటూ డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై శనివారం మెట్పల్లి CDPO దారోజు పద్మను ACB అధికారులు పట్టుకున్నారు.
ఏసీబీ తెలిపిన వివరాలు ప్రకారం.. మెట్పల్లి అర్బన్ మండలంలోని 21 అంగన్వాడీ కేంద్రాల నుంచి ఒక్కో కేంద్రానికి నెలకు రూ.1,000 చొప్పున డబ్బులు ఇవ్వాలని CDPO డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. మూడు నెలలకు సంబంధించి మొత్తం రూ.63,000 చెల్లించాల్సి వచ్చింది.
ఫిర్యాదు ఆధారంగా ACB అధికారులు ట్రాప్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఫిర్యాదుదారు నుంచి రూ.63,000 తీసుకుంటుండగా CDPOను పట్టుకున్నట్లు ACB తెలిపింది. ఆమె వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
అనంతరం CDPOను అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ప్రత్యేక ACB కోర్టులో హాజరుపరిచేందుకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని ACB వెల్లడించింది.
లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి: ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ACB టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
