అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ఘనంగా గణనాథునికి 108 రకాల ప్రసాదాల సమర్పణ

కరీంనగర్, సెప్టెంబర్ 22: భగత్‌నగర్‌లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ మహాగణపతికి సుమారు 108 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి మహాప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణనాథుడు సకల బాధల నుంచి విముక్తి కల్పించడంతో పాటు విఘ్నాలను తొలగించి విద్యార్థులకు చక్కని విద్య, ఉజ్వల భవిష్యత్తును ప్రసాదిస్తాడని అన్నారు. ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు భక్తుల్లో నూతన ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
గణనాథుడికి ఇష్టమైన ఉండ్రాళ్లు, మోదకాలు, గారెలు, పులిహోర, పెరుగన్నం, సిరా, పొంగలి, పాయసం, గుడాలు, అటుకులతో పాటు వివిధ రకాల ఫలహారాలు, పండ్లను నైవేద్యంగా సమర్పించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు భక్తిశ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి మహాహారతి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
