
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం ధనల కొండయ్య కాంప్లెక్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి బ్రాండ్ కళ్యాణి జువెలర్స్‌లో గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. దొంగలు దుకాణంలోకి చొరబడి నాలుగు కిలోల వెండి ఆభరణాలు, రెండున్నర తులాల బంగారాన్ని అపహరించినట్లు సమాచారం. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. కరీంనగర్ క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలనలో ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
