హుజురాబాద్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు డిమాండ్

కరీంనగర్, జూలై 28 : హుజురాబాద్ డిప్యూటీ డీఎంహెచ్ఓ చందు నాయక్‌ను విధుల నుండి వెంటనే తొలగించి, ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పిడిఎస్యు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా అంగిడి కుమార్ మాట్లాడుతూ, “హుజురాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా ప్రైవేట్ హాస్పిటల్స్ ఏర్పాటు అవుతున్నా, డిప్యూటీ డీఎంహెచ్ఓ చందు నాయక్ కనీస పర్యవేక్షణ చేయడం లేదు. ప్రజలపై ఆర్థిక భారం మోపుతూ, అనవసర టెస్టులు చేయిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉండి కూడా ఆయన బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయకుండా, ప్రైవేట్ ఆసుపత్రులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న చందు నాయక్‌పై శాఖపరమైన విచారణ జరిపి, తగిన శిక్ష ఇవ్వాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రమేష్, పద్మ, శిరీష, ష తదితరులు పాల్గొన్నారు.
