
జమ్మికుంట: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఘన్ముకుల, బేతిగల్ గ్రామాలకు చెందిన యువజనులు (CSI చర్చ్) ఆదివారం రోజున జమ్మికుంటలోని స్పందన అనాథ ఆశ్రమంలో ప్రత్యేక వేడుకలను నిర్వహించారు. క్రిస్మస్ ప్రేమ సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆశ్రమంలోని సుమారు 20 మంది పిల్లలు, సిబ్బందితో కలిసి సందడి చేశారు.
ఈ సందర్భంగా పిల్లలకు ప్రత్యేక భోజనం వడ్డించడం, బహుమతుల పంపిణి, కేక్ కటింగ్, బైబిల్స్, కూరగాయలు మరియు నిత్యావసర సరుకులు అందజేశారు. పిల్లల ముఖాల్లో ఆనందాన్ని చూడటం తమకె పెద్ద క్రిస్మస్ కానుక అని పాల్గొన్న యువజనులు భావించారు.
తరువాత, రైల్వే స్టేషన్ పరిసరాలు మరియు రోడ్డుపక్కన ఉన్న నిరుపేదలకు దుప్పట్లు, ఆహారం పంపిణీ చేస్తూ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో కొత్తపల్లి దీక్షిత్ క్రిస్మస్ వర్తమానం అందించగా, ప్రత్యూష, క్రిస్టిన్, సంద్యారాణి తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
