
కరీంనగర్లో మహిళా పోలీసు కాన్ఫరెన్స్
కరీంనగర్ : కరీంనగర్ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో మహిళా పోలీసు కాన్ఫరెన్స్‌ను సీపీ గౌస్ అలం, ఐపీఎస్ నేతృత్వంలో అస్ట్రా కన్వెన్షన్ హాల్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళా పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. సీపీఆర్ ట్రైనింగ్, POSH చట్టంపై అవగాహన, మద్యం సేవించి వాహనాలు నడిపే డ్రైవర్లపై చెక్‌లు వంటి అంశాలపై వివరణ ఇచ్చారు.
‘నారీ శక్తి’కు ప్రాధాన్యం ఇస్తూ, మహిళల పాత్రను విజిబుల్ పోలీసింగ్ లో మరింతగా పెంచేందుకు ఈ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుందని సీపీ తెలిపారు.
