
కరీంనగర్ జిల్లా మద్యం దుకాణాల రిజర్వేషన్లు పూర్తిచేసిన కలెక్టర్
కరీంనగర్ : జిల్లాలో మద్యం దుకాణాల నిర్వహణకు సంబంధించిన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో పూర్తి చేశారు. మొత్తం 94 మద్యం దుకాణాల లో భాగంగా 17 దుకాణాలు గీత కార్మికులకు, 9 దుకాణాలు ఎస్సీ కేటగిరీకి డ్రా పద్ధతిలో కేటాయించారు.
డిసెంబర్ 1, 2025 నుండి అమల్లోకి రానున్న నూతన టెండర్ దారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా, అధికారిక నోటిఫికేషన్ విడుదలకు ముందుగానే ఈ రిజర్వేషన్లను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
