
సిరిసేడు గ్రామంలో కార్డన్ అండ్ సర్చ్ కార్యక్రమం – 72 వాహనాలు సీజ్

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో ఆదివారం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో పాటు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు. సీపీ ఆదేశాల మేరకు ఏసీపీ మాధవి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 72 వాహనాలను సీజ్ చేసి, పెండింగ్ చలాన్లు తక్షణమే చెల్లించాలని సూచించారు.
మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా సురక్షిత ప్రయాణం సాధ్యమని ఏసీపీ సూచించారు. దసరా సెలవుల సందర్భంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ , వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి, ఇల్లందకుంట ఎస్సై క్రాంతి కుమార్ లతో పాటు సబ్ డివిజన్ ఫోర్స్, టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.

