కరీంనగర్: కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు సామాజిక న్యాయానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విజయమని పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి రియాజ్ అన్నారు.
ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ, కుల గణన, ఎస్సీ వర్గీకరణ, ముస్లిం రిజర్వేషన్ చట్టబద్ధత వంటి నిర్ణయాలతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక ఘనత సాధించిందన్నారు. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన, డీఎస్సీ ద్వారా 11,000 ఉపాధ్యాయ నియామకాలు, లీకేజీ రహిత పరీక్షలు చేపట్టినట్లు వివరించారు.
కేసీఆర్ శకం ముగిసిందని, నిరుద్యోగులు, పట్టభద్రులు నరేందర్ రెడ్డికి తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
