కరీంనగర్: ప్రైవేట్ మెడికల్ స్టాఫ్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్ధార్ రవీందర్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నా పై కుట్రలు జరుగుతున్నాయి. నామినేషన్ సమయంలో మా వాహనాలను అడ్డుకొని, మంత్రుల వాహనాలను అనుమతించారు” అని ఆరోపించారు.
“కరోనా సమయంలో సేవలందించిన వైద్యులను గుర్తించాలి. గెలిచిన వెంటనే మెడికల్ స్టాఫ్ కోసం సొంత స్థలాన్ని ప్రభుత్వం నుంచి మంజూరు చేయించేందుకు కృషి చేస్తాను” అని హామీ ఇచ్చారు.
పట్టభద్రుల హక్కుల కోసం “ఒక్క రూపాయికే 5 లక్షల భీమా, అంత్యక్రియల పథకం, నల్ల కనెక్షన్” వంటి పథకాలు అమలు చేస్తానని ప్రకటించారు. అలాగే, “నిజమైన ప్రజాసేవకులకే మండలిలో అవకాశం ఇవ్వాలి” అంటూ తనకు ప్రాధాన్యత ఓటు (1) వేసి గెలిపించాలని కోరారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
