ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త అహర్నిశలు కృషి చేయాలని బల్మూరి వెంకట్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి తో కలిసి బుధవారము గంభీరావుపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎం ఎల్ సి బల్మూరి వెంకటి నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి లు మాట్లాడుతూ.., ప్రభుత్వము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాల్లోని పట్టభద్ర యువకులకు వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. టిఆర్ఎస్ పాలనలో విద్యార్థులు చదువుకున్న ఉద్యోగాలు రాలేదని అమ్ముకునే పరిస్థితి ఉండేదని, ఆ నమ్మకాన్ని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము వైదొలగే విధంగా టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగేలా ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు. టిఆర్ఎస్ బిజెపిలో రెండు ఒకటై ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పోటీలో దింపలేకపోయిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను ఒక్కొక్కటి అమలు చేస్తుందని దానిని మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారని, ఆ విధంగా కాకుండా ప్రభుత్వము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇప్పటివరకు కల్పించిన ఉద్యోగాలు గ్రామాల్లోని విద్యావంతులకు ఒకటికి పది మార్లు కలిసి ఓటును అభ్యర్థించాలని కోరారు. సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ హమీద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొమిరిశెట్టి తిరుపతి లతోపాటు పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
