పెబ్బేర్ మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో తొలి తెలుగు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సీనివాసులు గౌడ్, మార్కెట్ డైరెక్టర్ రామన్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేసాగర్, బసవరాజ్ గౌడ్, బత్తుల బాలగోడు, రాజ గౌడు, నరసింహ గౌడ్, రమేష్ గౌడ్, కాటమణి వెంకటయ్య గౌడ్, కృష్ణయ్య గౌడ్, మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ, సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జీవితం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ప్రేరణనిచ్చేలా ఉండాలని అభిప్రాయపడ్డారు.
