రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకేపల్లి, అరెపల్లి గ్రామాల్లో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ నిధుల ద్వారా మంజూరైన రూ. 25 లక్షల సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు బుధవారం రోజున ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్, ఇటిక్యాల రాజు, సిల్వెని మల్లేశం, సిల్వెని ప్రశాంత్, గుండెకర్ల లక్ష్మణ్, పోచంపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి అందించిన సహాయాన్ని వారు ప్రశంసించారు.
ఈ పనుల ద్వారా గ్రామాల్లో రహదారి సమస్యలు, నీటి పారుదల సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.

