తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును హైదరాబాదులో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసం నందు వైరా మాజీ శాసనసభ్యులు వైరా నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జ్ బాణోత్ మదన్ లాల్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. హైదరాబాదులో మంగళవారం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసము నందు జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా నాయకులతో కలిసి భాణోత్ మదన్ లాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేయాలని అందుకు అందరు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా మదన్ లాల్ మాట్లాడుతూ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయమే ధ్యేయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కృషి చేస్తామని పార్టీ శ్రేణులు కూడా సిద్ధంగా ఉన్నారని ఆన్నరు
