జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం ఉదయం ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు బొద్దుల రవీందర్ ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు నిర్వహించగా ఆలయ అర్చకులు శేషం వరప్రసాద్ ప్రత్యేక పూజలను చేశారు . స్వామివారికి చుంచు వీరేశం దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించగా, ఈ ఉత్సవాలలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు, కౌన్సిలర్లు బొద్దుల అరుణ, జుగూరు సదానందం, పొనగంటి విజయలక్ష్మి, ఆలయ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రామ్మూర్తి, వి,తిరుపతి, వి, రవీందర్, చిరంజీవి వందలాది మంది భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
