భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 2: వైరా నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ ను ఆదివారం రోజు వారి స్వగృహం నందు జూలూరుపాడ్ చిన్న పత్రికల సంఘ అధ్యక్షులు భూక్య వీరు నాయక్, ఉపాధ్యక్షులు కంచపోగు నరసింహారావు లు మర్యాదపూర్వకంగా కలిసి వారికి శాలువా కప్పి జూలూరుపాడు మండలంలో గల మీడియా మిత్రులు పడుతున్న కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అట్టి విషయాన్ని ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా తెలియజేయాలని వారు సూచించారు. అలాగే నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా వారు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
