జమ్మికుంట: అమెరికాలో ఉన్నత విద్య కోసం టికెట్ బుక్ చేస్తానని నమ్మించి రూ.6 లక్షల మేర మోసం చేసిన ఘటనలో ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదైంది. టౌన్ సీఐ వరగంటి రవి అందించిన వివరాల ప్రకారం, కొత్తపల్లి గ్రామానికి చెందిన వొల్లాల రవీంద్రనాథ్ గౌడ్ (47) తన కుమార్తెకు యూఎస్ఏలో ఉన్నత విద్య కోసం టికెట్ బుక్ చేయించేందుకు కరీంనగర్‌కు చెందిన అమృత ట్రావెల్స్ అండ్ టూర్స్ యజమాని దయ్యాల సతీష్‌కు ఫోన్‌పే ద్వారా రూ.1,80,000 చెల్లించారు.
సతీష్ నమ్మకమైన వ్యక్తినని, తాను జమ్మికుంటలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దయ్యాల శ్రీనివాస్ బాబాయ్‌ని కూడా అని తెలిపాడు. చదువుల కోసం రూ.40 లక్షల రుణం తీసుకొని కాలేజ్ ఫీజు చెల్లించిన రవీంద్రనాథ్, సతీష్ 2023 ఆగస్టు 13న టికెట్ బుక్ చేశానని చెప్పగా, 9వ తేదీకి టెక్నికల్ ఇష్యూస్ వల్ల టికెట్ క్యాన్సిల్ అయిందని చెప్పాడు.
మళ్లీ టికెట్ బుక్ చేయాలంటే రూ.3.25 లక్షలు అవసరమని చెప్పగా, రవీంద్రనాథ్ మొదటగా రూ.2 లక్షలు చెల్లించారు. అనంతరం గతంలో చెల్లించిన మొత్తాన్ని రీఫండ్ చేస్తానని చెప్పి, మళ్ళీ రూ.3.27 లక్షలు తీసుకున్నాడు. ఈ వ్యవహారంలో నవీన్ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించాడు. ఇతను నవీన్ ట్రావెల్స్‌కి చెందినవాడు కాగా, ఆర్వో కడపకు చెందినవాడిగా గుర్తించారు.
మొత్తం రూ.6 లక్షలు మోసపోయినట్లు రవీంద్రనాథ్ ఫిర్యాదు చేయడంతో, దయ్యాల సతీష్, నవీన్, దయ్యాల శ్రీనివాస్‌పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. విచారణ కొనసాగుతోంది.
