
వీకేఎస్పీ జమ్మికుంట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలు
జమ్మికుంటలో వీకేఎస్పీ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక శివాలయం పరిధిలోని అంగన్వాడి కేంద్రంలో చిన్నారులతో కలిసి సరస్వతి పూజ నిర్వహించి, అక్షర శ్రీకార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నారులకు పలుకలు, బలపాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు గుండా రాజేంద్రప్రసాద్, కార్యదర్శి చందా సంతోష్, కోశాధికారి చిదురాల పూర్ణచందర్, జోన్ చైర్పర్సన్ అయితు రమేష్తో పాటు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. విద్యకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు చిన్నారుల్లో చదువు పట్ల ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
