
ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’
మెగాస్టార్ Chiranjeevi కథానాయకుడిగా, Anil Ravipudi దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ Mana Shankara Vara Prasad Garu సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. మంచి టాక్‌తో పాటు వసూళ్లలోనూ దూసుకెళ్లిన ఈ చిత్రం, చిరంజీవి కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం.
సినీ ప్రేక్షకులు, మెగా అభిమానులకు తాజాగా చిత్రబృందం మరో శుభవార్తను అందించింది. సంక్రాంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పది రోజులపాటు పెంచిన టికెట్ ధరల అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ గడువు ముగియడంతో నేటి నుంచే రెగ్యులర్ ధరకే టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో సినిమా మరింత విస్తృత ప్రేక్షకాదరణ పొందుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
చిరంజీవి ఎనర్జిటిక్ నటన, అనిల్ రావిపూడి వినోదాత్మక టేకింగ్, Bhims Ceciroleo అందించిన ఆకట్టుకునే సంగీతం సినిమాను విజయపథంలో నిలిపాయి. క్లైమాక్స్‌లో Venkatesh ఇచ్చిన మెరుపులు ప్రేక్షకులను మరింత అలరించాయి.
మరోవైపు ఓవర్సీస్ మార్కెట్లోనూ ఈ మూవీ అదరగొడుతోంది. ఇప్పటికే 4.2 మిలియన్ డాలర్లు వసూలు చేసి, 5 మిలియన్ క్లబ్ వైపు దూసుకుపోతోంది.
