వర్క్ ఫ్రమ్ హోం మోసానికి బలైన మహిళ.. కేపీహెచ్బీలో ఆత్మహత్య
హైదరాబాద్ కేపీహెచ్బీ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. వర్క్ ఫ్రమ్ హోం పేరుతో జరిగిన మోసానికి గురై అనూష అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. సైబర్ నేరగాడు చేతిలో లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిన ఆమె తీవ్ర మనస్తాపానికి గురై గురువారం తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. చనిపోవడం ముందు అనూష లేఖ రాసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆన్లైన్ యాప్లు, వర్క్ ఫ్రమ్ హోం పేరుతో నమ్మి ఎవ్వరూ మోసపోకండని ఆమె లేఖలో పేర్కొనడంతో ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
