జమ్మికుంట, ఏప్రిల్ 25: హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముంటున్న జీప్ డ్రైవర్ వోల్లాల వెంకన్న, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్దనే ఉంటున్న సమయంలో శుక్రవారం మధ్యాహ్నం వడదెబ్బకు గురై మృతి చెందారు. వెంకన్నకు భార్య మరియు ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మరణంతో కుటుంబం తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయింది. నిరుపేద కుటుంబం పట్ల ప్రభుత్వానికి ఆదుకోవాలని బంధువులు విజ్ఞప్తి చేశారు.
