ఆదిలాబాద్: ఫిర్యాదుధారునిపై విచారణ నిర్వహించి, ఆ రిపోర్ట్ అతనికి వ్యతిరేకంగా వెళ్లకుండా చూడటానికి, అలాగే అధికారిక సహాయం అందించేందుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఆదిలాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయంలో జిల్లా విస్తరణ & మీడియా అధికారి మాచర్ల పోశెట్టి రవి శంకర్ ఫిర్యాదుధారుని నుంచి రూ.30,000/- లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
అక్రమంగా లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన రవి శంకర్‌పై సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రభుత్వ అధికారిగా పనిచేస్తూ, ప్రజాసేవకు భంగం కలిగించేందుకు పాల్పడిన రవి శంకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
– Zindagi9News
