జమ్మికుంట, 15 మార్చి 2025: కరీంనగర్ జిల్లా బిజిగిరి షరీఫ్ – పోత్కపల్లి రైల్వే స్టేషన్ల మధ్య, పాపయ్యపల్లి గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. H 52 గూడ్స్ రైల్వే ట్రైన్ కిందపడి యువతీ, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు.
మృతుల వివరాలు:
యువకుడు: మినుగు రాహుల్ (18) – రాచపల్లి గ్రామం, ఇల్లందకుంట మండలం.
యువతి: గుర్తింపు తెలియలేదు, వయసు సుమారు 18 సంవత్సరాలు.
ఇద్దరూ ఏ కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు అనే విషయంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల విచారణ
ఈ ఘటనపై A. మహేందర్, రైల్వే పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ (మంచిర్యాల) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సమాచారం అందించగలరు
ఈ కేసుకు సంబంధించి ఏమైనా వివరాలు తెలిసినవారు రైల్వే పోలీస్ అధికారుల ఈ నంబర్లకు సమాచారం ఇవ్వగలరు:
📞 9701112343, 8712658596.
