జూలూరుపాడు (జనవరి 26) :జూలూరుపాడు మండలం మండల పరిధిలోని సూరారం గ్రామంలో పంచగంగా శ్రీ 650 విత్తనాలు వేసిన రైతు తోటలను. విత్తనాల డిస్ట్రిబ్యూటర్ ఎస్ ఎస్ వి యజమాని అడపాసురేష్ మరియు దేవేందర్‌లు కలిసి శనివారం మండల వ్యాప్తంగా వివిధ గ్రామాలకు చెందిన రైతు సోదరులను తీసుకువెళ్లి పరిశీలించారు చెట్లు వేపుగా పెరిగి మిర్చి కాయలు చెట్లకు ఇరగ కాయడంతో రైతులు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
విత్తనాలు వేసిన రైతు కూడా తన తోట చూడటానికి వచ్చిన రైతులకు వివరించాడు తక్కువ ఖర్చుతో తెగుళ్లను తట్టుకునే ఈ రకం విత్తనాలు వేయడం వలన తన పొలంలో ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల మధ్యలో దిగుబడి వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. జిల్లావ్యాప్తంగా విత్తనాలను అందించే డిస్ట్రిబ్యూటర్ అడపా సురేష్ తోటను చూసేందుకు వచ్చిన రైతులతో మాట్లాడారు.
ఎక్కువ చీడపీడలను తట్టుకుంటుందని మంచి దిగుబడి వస్తుందని మండల వ్యాప్తంగా సుమారు 100 ఎకరాల్లో 30 మంది రైతులకు పంచగంగా శ్రీ 650 విత్తనాలను అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల వ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు పాల్గొన్నారు.
